రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కోహెడకు చెందిన అన్నదమ్ములు సానేం శేఖర్, సానేం ముత్యాలు.. అనాజ్‌పూర్ నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఉమ్మర్ఖాన్గూడ వద్దకు రాగానే ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన ముత్యాలును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అన్నదమ్ములను కబళించిన గుర్తుతెలియని వాహనం... - CRIME NEWS IN TELANGANA
పొరుగూరు వెళ్లి... ఇంటికి తిరిగివస్తున్న అన్నదమ్ములు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం వస్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

BIKE ACCIDENT AT KOHEDA... ONE DIED ONE, SEVERELY WOUNDED
అన్నదమ్ములను కబళించిన గుర్తుతెలియని వాహనం...
ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు గాయాలు
Last Updated : Nov 28, 2019, 8:18 AM IST