విద్యుత్ బిల్లులు అధికంగా వేశారని... వాటిని వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని... విద్యుత్ అధికారులకు డిమాండ్ల పత్రాన్ని అందించారు.
''లాక్డౌన్ సమయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేసినప్పుడు... విద్యుత్ అధికారులు ఇంటింటికి వెళ్లి బిల్లులు ఎందుకు కొట్టలేదు. ఇంటికి రావద్దంటూ ఎవరైనా ఆపారా? అప్పుడు మీ నిర్లక్ష్యంతో వారిని పంపకుండా ఇప్పుడు అధిక ఛార్జీలు వేయడం ఏంటి? ఆర్థికంగా నష్టపోయిన వారిపై మరింత భారం పెంచేలా బిల్లులు ఉన్నాయి.''