రైతుకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై ఆయనతో పాటు తెరాస నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు.
వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి - నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్
భారత్ బంద్ పిలుపుతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ పార్టీలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.
వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలి: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి.
ఇదీ చదవండి:రైతులకు బ్యాంక్‌ల మద్దతు- కానీ బంద్‌కు దూరం