ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో తెలంగాణ ఎన్నారైలు 30 మంది కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు 700 మంది హాజరయ్యారు. మహిళలంతా కలిసి బతుకమ్మ, దాండియా ఆటలను ఉల్లాసంగా ఆడి సందడి చేశారు. ఐర్లాండ్‌లోని పిల్లలకు బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. దుర్గామాత పూజతో సద్దుల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆడపడుచుల పాటలు, దాండియా ఆటలు.. వీక్షకులను ఆకర్షించాయి. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ప్రతి ఆడపడుచుకు బహుమతి ప్రదానం చేశారు.
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు - ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఏడు సంవత్సరాలుగా ఏటా 40 మంది వాలంటీర్లతో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు