పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతుల హత్యను బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ధర్నాకు దిగారు. లాయర్లకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
'న్యాయవాదుల హత్య కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు' - న్యాయవాదుల హత్య వార్తలు
న్యాయవాద దంపతుల హత్యను బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
'న్యాయవాదుల హత్య కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు'
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి లాయర్ల మీద ఎన్నోమార్లు దాడులు జరిగాయని బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ ఫణీంద్ర భార్గవ్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లలో జరిగిన న్యాయవాదుల హత్యను ఆయన ఖండించారు. హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని... కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులకు ఎవరూ బెయిల్ పిటిషన్ వెయ్యొద్దని సూచించారు. రక్షణ కల్పించాలని అప్పీలు చేసుకున్న న్యాయవాదులకు పోలీసులు అండగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన