తెలంగాణ

telangana

ETV Bharat / state

గంగుల శ్రీనివాస్​ అంతిమయాత్రలో బండిసంజయ్​, అర్వింద్​, డీకే అరుణ - BJP latest news

భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్​ అంతిమ యాత్రలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్​ పాల్గొన్నారు.

Bandisanjay at Gangula Srinivas funeral
Bandisanjay at Gangula Srinivas funeral

By

Published : Nov 6, 2020, 3:26 PM IST

Updated : Nov 6, 2020, 8:25 PM IST

బండి సంజయ్ అక్రమ అరెస్ట్​కు నిరసనగా ఈనెల 1న భాజపా కార్యాలయం ఎదుట రంగారెడ్డి జిల్లా యాచారం మాండలం తమ్మలోనిగూడెంకు చెందిన గంగుల శ్రీనివాస్పె ట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

ఇవాళ గంగుల శ్రీనివాస్ అంతిమయాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​, డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్​, కార్యకర్తలు పాల్గొన్నారు. భాజపా కార్యకర్తలు ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని బండి సంజయ్​ పిలుపువిచ్చారు. అమరుల రక్తపు మడుగులో రాక్షస పాలనను కేసీఆర్ నడిపిస్తున్నారని విమర్శించారు.

Last Updated : Nov 6, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details