రంగారెడ్డి జిల్లా బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో బిహార్ రాష్ట్రానికి చెందిన బాలకార్మికులతో ఓ ఇంట్లో గాజులు తయారు చేయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది చిన్నారులను గుర్తించి వారిని అక్కడి నుంచి బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
గాజుల పరిశ్రమ నుంచి బాల కార్మికులకు విముక్తి - latest news of rangareddy
బాలకార్మికులతో గాజులు తయారు చేయిస్తున్న స్థావరంపై రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీసు దాడి చేశారు. చైల్డ్‌లైన్ సహాయంతో తొమ్మిది మంది బాలలకు విముక్తి కల్పించారు. వారిని బాల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

గాజుల తయారుచేస్తున్న 9 మంది బిహార్ బాలకార్మికులకు విముక్తి
నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, ఇంటిని సీజ్ చేశారు. చిన్నారులను నిర్బంధించి పనులు చేయించడం నేరమని వారు తెలిపారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.