తెలంగాణ

telangana

ETV Bharat / state

కష్టపడితేనే లక్ష్యాలను చేరుకుంటాం: గోపీచంద్ - telangana badminton association

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని ఓఆర్ఓ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహించిన స్పోర్ట్స్ మేనియాకు బ్యాట్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. బ్యాడ్మింటన్​లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వారైనా సమస్యలు ఎదుర్కొని పైకి ఎదగాలని గోపీచంద్​ సూచించారు.

pullela gopichand attended the sports mania in rangareddy dist
కష్టపడితేనే లక్ష్యాలను చేరుకుంటాం: గోపిచంద్

By

Published : Feb 20, 2020, 12:33 PM IST

ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యం చేరుకోవాలంటే కష్టంతో పాటు ప్రణాళిక కూడా ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని ఓఆర్​ఏ స్పోర్ట్స్ క్లబ్ స్టూడెంట్స్ నిర్వహించిన స్పోర్ట్స్ మేనియాకు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. గొప్ప ఆటగాళ్లను తయారు చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేశామని వివరించారు.

తల్లిదండ్రుల కృషితోనే..

ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వారైనా సమస్యలు ఎదుర్కొని పైకి ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడినప్పుడే లక్ష్యాలను చేరుకుంటారని తెలియజేశారు. తన తల్లిదండ్రుల కృషితోనే క్రీడాకారుడిగా ఎదిగినట్లు చెప్పారు. చదువుతోపాటు క్రీడలు కూడా చాలా అవసరమన్నారు.

కష్టపడితేనే లక్ష్యాలను చేరుకుంటాం: గోపీచంద్

ఇవీ చూడండి:భజ్జీ.. రోహిత్ డబుల్ సెంచరీ చేయాలా ఏంటీ!

ABOUT THE AUTHOR

...view details