తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతును రాజుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సబిత - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో వానా కాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ అనితా రెడ్డి హజరయ్యారు. ప్రభుత్వ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.

vanakalam-2020 crop plan awareness meeting
రైతును రాజుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సబిత

By

Published : May 26, 2020, 7:07 PM IST

ప్రతి రైతు.. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకుని ఆర్థికంగా లబ్ధిపొందాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దుబ్బచర్ల, నాగారం గ్రామల్లో వానాకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబిత అన్నారు. రైతు బంధు, రైతులకు బీమా, తదితర సౌకర్యాలు కల్పించి రైతుకు సర్కారు అండగా ఉంటుందని పేర్కొన్నారు. కందులు, పత్తి, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి లాభదాయక పంటలు వేసి... అన్నదాతలు లాభాల బాటలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ అనితా రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కన్నోళ్ల కన్నీళ్లు... పట్టింపు లేని పిల్లలు!

ABOUT THE AUTHOR

...view details