బెంగళూరు జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు - Bangalore National Highway latest update
గగన్‌పహాడ్ అప్ప చెరువుకు గండి పడటం వల్ల పూర్తిగా దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారిని అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, బెంగుళూరు, అనంతపూర్, కడప వైపు వెళ్లే వాహనాలకు ఉపశమనం లభించింది.
బెంగళూరు జాతీయ రహదారిని పునరుద్ధరించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ గగన్‌పహాడ్ అప్ప చెరువుకు గండి పడటం వల్ల పూర్తిగా దెబ్బతిన్న బెంగళూరు జాతీయ రహదారిని అధికారులు పునరుద్ధరించారు. గత 3 రోజులుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోవడం వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు యుద్ధ ప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించారు. ఫలితంగా ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, బెంగుళూరు, అనంతపూర్, కడప వైపు వెళ్లే వాహనాలకు ఉపశమనం లభించింది.
- ఇదీ చదవండి :భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం