తెలంగాణ

telangana

ETV Bharat / state

Musi: మూసీనది ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - మూసీ నది ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు

మూసీనదీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని తెలియజేస్తూ.. ఓ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Authorities demolish illegal structures in the Musi River catchment area
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

By

Published : Jun 28, 2021, 5:32 PM IST

అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

రాజేంద్రనగర్ పరిధి హైదర్​గూడా మూసీనది పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. ఆర్​డీఓ చంద్రకళ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ తహసీల్దార్​ దగ్గరుండి అక్రమంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేయించారు. అనంతరం ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందని తెలియజేస్తూ.. ఓ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు.

మూసీనది పరివాహక ప్రాంతాల్లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని ఎమ్మార్వో చంద్రశేఖర్​ గౌడ్ తెలిపారు. మరోమారు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మూసి నదిలో మట్టిపోసి పూడుస్తున్న ఓ లారీని రెవెన్యూ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

భారీ ప్రణాళికతో...

మొదట రెండెకరాల భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు మరో ఐదెకరాల భూమిని కబ్జా చేసి మొత్తం ఏకకాలంలో రియల్ వెంచర్ వేసి అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. మూసీనదిని పూర్తిగా చదును చేసిన తర్వాత రాజకీయ నాయకుల అండ తీసుకోవాలని భావించారు. ఈ వ్యవహారంపై "కళ్లు మూసుకున్నారా?" అనే శీర్షకతో ఈటీవీ భారత్ కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు. కబ్జాపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్ కథనంతో మూసీ నది కబ్జాకు అడ్డుకట్ట

ABOUT THE AUTHOR

...view details