రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అలూరులోని స్టేట్ బ్యాంకులో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. కట్టర్ల సాయంతో కిటికీ గ్రిల్స్‌ను తొలగించటానికి ప్రయత్నించారు. అలారమ్ మోగటంతో దుండగులు పరారయ్యారు. గ్రామ ప్రజలు వారిని వెంబడించినా... ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్బీఐలో చోరికి యత్నం... మోగిన అలారం - ఎస్బీఐ వార్తలు
ఎస్బీఐలో చోరీకి దుండగులు ప్రయత్నించారు. కట్టర్ల సాయంతో కిటికీ గ్రిల్స్ తొలగింపునకు యత్నించగా... అలారం మోగి... దొంగలు పరారైన ఘటన చేవెళ్లలో చోటు చేసుకుంది.
ఎస్బీఐలో చోరికి యత్నం... మోగిన అలారమ్