కొవిడ్ కేసులు తమ ప్రాంతంలో పెరుగుతున్నా ప్రజలు ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్లో ఇప్పటికే 200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 12 మంది మరణించారని చెప్పారు. మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కి ఈ విషయం తెలిపామన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కూడా త్వరలో కలుస్తామని చెప్పారు. ఎవరూ బయటికి వెళ్లకుండా నియమం పాటించినట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని ఆమె సూచించారు.
'మా ప్రాంతంలో కరోనా సమస్య నివారణ కోసం సీఎంను కలుస్తాం' - అత్తాపూర్ డివిజన్ తాజా కరోనా వార్తలు
కరోనా మహమ్మారి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అత్తాపూర్ కార్పొరేటర్ విజయ జంగయ్య కోరుతున్నారు. ప్రజలు ఆంక్షలు పాటించకుండా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ను కలుస్తామని చెబుతున్నారు.

మా ప్రాంతంలో కరోనా సమస్య కోసం సీఎంను కలుస్తాం
అత్తాపూర్ డివిజన్ ఆనుకుని ఉన్న జియాగూడ డివిజన్ నుంచి ఇక్కడికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అందువల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రతిరోజు మున్సిపల్ అధికారులు బ్లీచింగ్, శానిటైజ్ పక్రియ చేసినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తోందని తెలిపారు.
ఇదీ చూడండి :ఘట్‌కేసర్‌లో హత్యకు గురైన చిన్నారి ఆద్య తండ్రి ఆత్మహత్య