వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెద్దదిక్కుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్ని రెండింతలు చేశారని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో పెంచిన పింఛన్ ఉత్తర్వులను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.200 పింఛను అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ. 2015 అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారంపడినా పేదల సంక్షేమం విషయంలో వెనుకాడకపోవటానికి పథకాలే నిదర్శనమని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చుపెడితే దేశం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కేవలం పది వేల కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి పేర్కొన్నారు.
'పేదవారికి పెద్దదిక్కు మన ముఖ్యమంత్రి కేసీఆర్' - ASARA PENSION DISTRIBUTION IN CHEVELLA
రాష్ట్ర పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదిక్కుగా మారి పింఛన్ రెండింతలు చేశారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. పెంచిన పింఛన్ ఉత్తర్వులను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి అర్హులకు అందించారు.
!['పేదవారికి పెద్దదిక్కు మన ముఖ్యమంత్రి కేసీఆర్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3895863-thumbnail-3x2-ppp.jpg)
ASARA PENSION DISTRIBUTION IN CHEVELLA