రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని రావిరాల గేట్ వద్ద నుంచి ఆవులు, ఎద్దులతో నిండి ఉన్న బొలెరో వాహనంను రాష్ట్ర గోరక్ష దళ్ సభ్యులు గుర్తించారు. వారు ఆ వాహనాన్ని ఆపి పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు - పహాడీషరీఫ్‌లో మూగజీవాల తరలింపు అరెస్టు
బొలెరో వాహనంలో మూగజీవాలను తరలిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర గోరక్ష దళ్ సభ్యులు అప్రమత్తమయ్యారు. వాహనాన్ని వెంబడించి పహాడీషరీఫ్ వద్ద ఆపారు. చూస్తే అందులో ఆవులు, ఎద్దులు కిక్కిరిసి ఉన్నాయి. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు.
![మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు Arrested for evacuation of cows at pahadi shareef](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8090563-599-8090563-1595169661125.jpg)
మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు
నల్గొండ జిల్లా మాల్మల్లె పల్లి నుంచి బొలెరో వాహనంలో కిక్కిరిసిన ఎనిమిది మూగజీవులను తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై దీపక్‌సింగ్ ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు
ఇదీ చూడండి :గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం