మూడు రోజుల పాటు జరగనున్న గరిగుట్ట పెద్దమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జాతర ఏర్పాట్లను జల్పల్లి కౌన్సిలర్ బుడమల యాదగిరి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. పురపాలిక ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.
తుదిదశకు గరిగుట్ట పెద్దమ్మ జాతర ఏర్పాట్లు - తుదిదశకు గరిగుట్ట పెద్దమ్మ జాతర ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లాలో జల్పల్లి- మాదన్నగూడ అటవీప్రాంతంలో గరిగుట్ట పెద్దమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర ఏర్పాట్లను జల్పల్లి కౌన్సిలర్ బుడమల యాదగిరి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.

తుదిదశకు గరిగుట్ట పెద్దమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లు
రంగారెడ్డి జిల్లా జల్పల్లి-మాదన్నగూడ అటవీప్రాంతంలో ఈనెల 6,7,8 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ జాతరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరవుతారు. అమ్మవారి దేవాలయం అటవీప్రాంతంలో ఉండడం వల్ల అటవీ అధికారుల సహకారంతో జాతరను అత్యంత వైభవంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.