సోదరుడి ఇంటికి వచ్చిన ఓ వైద్యురాలిని అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకోవడం వల్ల పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రి వైద్యురాలు గురువారం మన్సూరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సోదరుడి ఇంటికి వచ్చారు. అపార్టుమెంటు వాసులు రావద్దని అభ్యంతరం చెప్పగా వాగ్వాదం చోటుచేసుకుంది.
గాంధీ వైద్యురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు - వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు
కరోనా వ్యాప్తి భయాందోళనలో గాంధీ ఆసుపత్రి వైద్యురాలిని ఓ అపార్ట్‌మెంట్ వాసులు అడ్డుకున్నారు. ఆవేదన చెందిన ఆ వైద్యురాలు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ విషయంపై మంత్రి ఈటలకు సైతం ఫిర్యాదు చేశారు.
![గాంధీ వైద్యురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు apartment dwellers who blocked the Gandhi doctor at mansoorabad rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6936183-385-6936183-1587808961336.jpg)
గాంధీ వైద్యురాలిని అడ్డుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు
ఆమె శుక్రవారం వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా అపార్టుమెంటులోని పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయంపై సదరు వైద్యురాలు శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి :మనవరాలితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి