ఏపీలోని విజయవాడ ఆలయ వెండి రథం ప్రతిమలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. దుర్గమ్మ సన్నిధిలోని వెండి రథంపై సింహం ప్రతిమల ఘటన దురదృష్టకరమని ఏపీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. రథానికి ఉండాల్సిన మూడు సింహాల ప్రతిమలు లేవని... వీటిపై సాయంత్రం వరకు కమిటీ పరిశీలించి నివేదికను ఇస్తుందన్నారు. నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షిస్తామన్నారు.
ఒక్క ప్రతిమే ఉంది.. విచారణ జరుపుతున్నాం: మంత్రి వెల్లంపల్లి
కనకదుర్గమ్మ ఆలయ వెండి రథానికి మూడు సింహం ప్రతిమలు లేవని.. ఒక్కటే మిగిలి ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆలయ రథాన్ని పరిశీలించిన ఆయన... విచారణ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. సాయంత్రం వరకు ప్రాథమిక నివేదిక అందుతుందని వెల్లడించారు.
ఒక్క ప్రతిమే ఉంది.. విచారణ జరపుతున్నాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి
తమ ప్రభుత్వం వచ్చాక రథం బయటికి తీయలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోనే ప్రతిమలు లేకుండా పోయయా? లేక తమ ప్రభుత్వంలోనే ఇలా జరిగిందా అనేది విచారణలో తేల్చుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల భద్రతపై త్వరలోనే సమీక్షిస్తామని... తగిన చర్యలు చేపడుతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను నమ్మవద్దని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు
Last Updated : Sep 16, 2020, 12:51 PM IST