తెలంగాణలో విద్యుదుత్పత్తిని నిలువరించాలి... కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ - AP letter to KRMB
12:16 August 30
విద్యుదుత్పత్తిని ఆపాలని లేఖ
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ చేస్తున్న విద్యుదుత్పత్తిని నిలువరించాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ఇండెంట్ లేకుండా చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపాలని ఆ రాష్ట్ర ఈఎన్సీ నారాయణ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
సాగునీటికి ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉందని నారాయణ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం, సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున అనుమతి అవసరమని లేఖలో వివరించారు. తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయడానికి వీల్లేదని చెప్పారు. ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:AGRI HUB: అగ్రిహబ్కు శ్రీకారం.. వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రోత్సాహం