తెలంగాణ

telangana

ETV Bharat / state

Seize: అర్హత లేని వైద్యులతో చికిత్సలు.. ఆస్పత్రి సీజ్ - ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

అర్హత లేని వైద్యులతో చికిత్సలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని అమ్మ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై చర్యలు చేపట్టారు.

Amma multy speciality  hospital seized in shadnagar
షాద్​నగర్​లో ఆస్పత్రి సీజ్

By

Published : Jun 8, 2021, 4:47 PM IST

ప్రజల ప్రాణాలతో ప్రైవేట్ ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. అర్హత లేని వైద్యులతో చికిత్సలు అందిస్తున్నాయి. క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండా వైద్యం అందిస్తున్నారన్న ఆరోపణలతో ఓ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్​ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని అమ్మ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు.

ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన వైద్యాధికారులు ఆస్పత్రిపై చర్యలు చేపట్టారు. జిల్లా మాస్ మీడియా అధికారి నరహరి, డిప్యూటీ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ దామోదర్ ఆస్పత్రికి చేరుకొని అక్కడ సిబ్బందిని బయటికి పంపించి వేశారు. అనంతరం ఆస్పత్రి సీజ్ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న మాస్ మీడియా అధికారి వివరించారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ పొడిగింపుపై కేబినెట్ భేటీ

ABOUT THE AUTHOR

...view details