అనంతరం శివాలయానికి వెళ్లి సుందరేశ్వర స్వామివారిని రేవిన్ దర్శించుకున్నారు. దేవాలయం వెనకాల ఉండే చిలుకూరు బాలాజీ గోశాలలో కొంత సమయం సరదాగా గడిపారు. స్వామివారి కృప ద్వారా కరోనా మహమ్మారి వీలైనంత త్వరగా మాయం కావాలని... అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నట్టు రేవిన్ తెలిపారు. మోయినాబాద్ సీఐ రాజు వారి బృందం.. రేవిన్ ప్రయాణానికి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్ - American consulate general judith revin
చెన్నై అమెరికన్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్.. చిలుకూరు బాలజీని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను.. ప్రధానార్చకులు రంగరాజన్‌ను అడిగి తెలుసుకున్నారు.
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న అమెరికన్ కాన్సులేట్ జనరల్