తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు.. ఉదయం 9 నుంచే షురూ - ALLOTMENT OF RAJIV SWAGRUHA FLATS

RAJIV SWAGRUHA FLATS: బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.

రేపటి నుంచే రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు.. ఉదయం 9 నుంచే షురూ
రేపటి నుంచే రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు.. ఉదయం 9 నుంచే షురూ

By

Published : Jun 26, 2022, 5:58 PM IST

Updated : Jun 27, 2022, 5:17 AM IST

RAJIV SWAGRUHA FLATS: హైదరాబాద్​ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నోటిఫికేషన్‌ ఇవ్వగా.. నేటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇవాళ ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాటరీ ప్రక్రియ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 27న పోచారం, 28న బండ్ల గూడ, 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా తీయనున్నారు. పారదర్శకతను నిర్ధారించడానికి పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డ్‌ చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఆధార్‌ సంఖ్యను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.

Last Updated : Jun 27, 2022, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details