రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి కార్యక్రమం చేపట్టారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని వీరపట్నం అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఘనచరిత్ర కలిగిన చెరువు జలకళ సంతరించుకోవడంతో ఎల్లప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని గంగమ్మను వేడుకున్నారు.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి - ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో హారతి
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి కార్యక్రమం నిర్వహించారు. వీరపట్నం అఖండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా సంప్రదాయం కొనసాగుతోంది.

ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో గంగమ్మకు అఖండ హారతి
ట్రస్ట్ నిర్వాహకులు ఐదేళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, ట్రస్టీ సదా వెంకట్‌రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ వీఆర్వో శ్రీరామ్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.