AIDS awareness walk: ప్రపంచంలో మూడవ అతిపెద్ద హెచ్ఐవీ అంటువ్యాధిని కలిగిన దేశంగా భారతదేశం ఉందని కామినేని ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్ స్వామి అన్నారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని ఆస్పత్రి ఆధ్వర్వంలో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. ఎల్బీనగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కామినేని ఆస్పత్రి హెచ్ఓడీ డాక్టర్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు.
Kamineni hospitals: కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ - ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి
AIDS awareness walk:ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రి ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ నిర్వహించింది. ఎల్బీనగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి పైగా పాల్గొన్నారు.
world aids day in kamineni: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కామినేని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. అవగాహనతోనే ఎయిడ్స్‌ను అరికట్టవచ్చని వైద్యులు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అదుపు చేయడంలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో కామినేని ఆస్పత్రి వైద్యులు కె.హరి కిషన్, రత్నాచారి, సత్యనారాయణరావు, రామకృష్ణ, రాజ్ కుమార్, రవిశంకర్, లక్ష్మి, ఇతర విభాగాల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: