రైతుకు అవకాశాలు, అవగాహన చాలా పెరిగిందని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం గణనీయమైన అభివృద్ధి చెందుతోందన్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేటలో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయ శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రముఖ సేంద్రీయ రైతు గుడివాడ నాగరత్నం నాయుడు సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ క్షేత్రంలో కలియ తిరిగారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం అవలంభిస్తున్న అనుకూల విధానాల వల్ల వ్యవసాయ అనుబంధ రూపురేఖలు మారిపోయాయని చింతల ప్రశంసించారు. నీటి మట్టాలు పెరిగిన దృష్ట్యా పంట వ్యవస్థలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. హరిత, శ్వేత, నీలి, గులాబీ విప్లవాలు విజయవంతమైన నేపథ్యంలో త్వరలోనే బ్రౌన్ విప్లవం తీసుకురావల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏటా విదేశాల నుంచి లక్షా 10 వేల కోట్ల రూపాయలను ముడినూనెల దిగుమతుల కోసం వెచ్చిస్తున్నందున బ్రౌన్ విప్లవం విజయవంతమైతే... ఆ మేరకు నగదు భారతీయ రైతుల చేతుల్లోకే వస్తాయన్నారు. నాలుగైదేళ్లల్లో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైతే... కొత్తగా ప్రొసెసింగ్ యూనిట్లు, పరిశ్రమలు రావడం వల్ల రైతులతోపాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ఛైర్మన్ గోవిందరాజులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, పీజేటీఎస్ఏయూ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్ రావు, నాబార్డు సీజీఎం వైకే రావు, రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో వ్యవసాయం రూపురేఖలు మారిపోయాయి: నాబార్డు ఛైర్మన్ ఇదీచూడండి:Supreme Court : 'కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి'