రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని హయత్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. కల్తీ పెట్రోల్, డీజల్ పోస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ పెట్రోల్ పోయడం వల్ల వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.
కల్తీ పెట్రోల్, డీజిల్ పోస్తున్నారంటూ ఆందోళన - HAYATHNAGAR FILLING STATION
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారులు ఆందోళనకు దిగారు. కల్తీ పెట్రోల్, డీజిల్ పోస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కల్తీ పెట్రోల్, డీజిల్ పోస్తున్నారంటూ ఆందోళన