తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం' - ఎల్బీనగర్​ ఎసీపీ తాజా వార్తలు

ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్​ ఏసీపీ శ్రీధర్​ రెడ్డి అన్నారు. వసంత్ పాలీక్లీనిక్​, మెడికవర్ హాస్పిటల్​ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

acp sridhar reddy  inaugurate free mega health camp in lb nagar
'ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం'

By

Published : Feb 26, 2021, 2:22 PM IST

ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ప్రజల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ శ్రీధర్​ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్​లోని వసంత్ పాలీ క్లీనిక్​, మెడికవర్ హాస్పిటల్​ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఏసీపీ శ్రీధర్​ రెడ్డి సూచించారు. బీపీ, ఈసీజీ, షుగర్ టెస్ట్​లతోపాటు ఇతర వైద్య పరీక్షలను వైద్యులు ఉచితంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కోడిపై మర్డర్​ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details