తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆడపిల్లలను ఏడిపిస్తే ఎవర్నీ వదలొద్దు' - HYDERABAD BAGH LINGAMPALLY TO RTC CROSS ROAD

దిశ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్​లో ఏబీవీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఇలాంటి ఘటనలు  పునరావృతం కాకుండా చట్టాలకు పదును పెట్టాలని విద్యార్థి నేతలు కోరారు.

నిందితులను తక్షణమే శిక్షించాలి : ఏబీవీపీ , విద్యార్థినిలు
నిందితులను తక్షణమే శిక్షించాలి : ఏబీవీపీ , విద్యార్థినిలు

By

Published : Dec 2, 2019, 4:30 PM IST

రంగారెడ్డి జిల్లాలో జరిగిన దిశ ఘటన నిందితులను వెంటనే శిక్షించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా వేలాది విద్యార్థులు ఇందిరాపార్కు వద్దకు చేరుకుని ధర్నా చేశారు. విద్యార్థినిలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తీసుకువచ్చి... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు ఏబీవీపీ నేతలు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

నిందితులను తక్షణమే శిక్షించాలి : ఏబీవీపీ , విద్యార్థినిలు
ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details