రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట వద్ద ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలపాలయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో45 మంది ప్రయాణీకులు ఉన్నారు.
పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అందులో 45 మంది ప్రయాణికులు.. - A bus that went to fields in Ranga Reddy
10:52 December 31
రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ నలుగురి తలకు బలమైన గాయాలు కావడంతో కోమాలో ఉన్నారని.. ప్రస్తుతం అక్యూవెన్సీలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని ఇప్పుడేమి చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 12మంది ప్రయాణికులు గాయపడగా సమీపాన లంగర్ హౌస్‌లోని రినోవా ఆసుపత్రికి తరలించారు.
వీరిలో ఎనమిది మందికి ప్రాథమికి చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన నలుగురికి అత్యవసర చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గురయిన ఆర్టీసీ బస్సును మొయినాబాద్ మండలం చిన్న మంగళారం నుంచి మెహదీపట్నం వస్తుండగా ఉదయం టిప్పుఖాన్ వద్ద కారును తప్పించబోయి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవీ చదవండి: