రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం న్యాలటకు చెందిన అనిల్.. కూతురు దివ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చేవెళ్లకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. వీరిని అటుగా వెళ్తున్న నర్సింహులు లిఫ్ట్ అడిగారు. ముగ్గురితో వెళ్తున్న వారి వాహనాన్ని ఇబ్రహీంపల్లి స్టేజి వద్ద బోలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన దివ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని బోలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దురు ప్రాణాలు కోల్పోయారు. అందులో మూడేళ్ల చిన్నారి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం
ఇద్దరిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం
ఇవి కూడా చదవండి:భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం