తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇంజినీర్ అధికారి అక్రమాస్తులు రూ. 3కోట్లు - లంచం పుచ్చుకుంటూ అడ్డంగా దొరికిన రంగారెడ్డి ఇంజినీర్ అధికారి

లంచం పుచ్చుకుంటూ.. ఏసీబీ అధికారులకు ఓ ఇంజినీర్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు.  ఓ అపార్ట్​మెంట్​కు సంబంధించిన అనుమతులు ఇవ్వడం కోసం రూ. 30వేలు డిమాండ్ చేసి.. డబ్బు తీసుకుంటుండగా బుక్కయ్యాడు. సదరు అవినీతి అధికారి రూ. 3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Acb raids in superintend engineering office
అడ్డంగా దొరికిన ఇంజినీర్ అధికారి

By

Published : Dec 12, 2019, 7:12 PM IST

Updated : Dec 17, 2019, 6:17 PM IST

సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ ఆపరేషన్, సైబర్​ సిటీ సర్కిల్ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో డివిజినల్ ఇంజినీర్ అధికారి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ అపార్ట్​మెంట్​కి సంబంధించి శివకుమార్ అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి పానల్ బోర్డ్ ట్రాన్స్​ఫర్ ఇవ్వడం కోసం రూ. 30,000లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ బతిమిలాడగా రూ. 25 వేలకు ఒప్పుకున్నాడు. వెంకటరమణ ఇంట్లో రూ. 26 లక్షలు, 60 తులాల బంగారం గుర్తించారు. రూ. 3కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇంజినీర్ అధికారి
Last Updated : Dec 17, 2019, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details