తెలంగాణ

telangana

ETV Bharat / state

ACB Raids: టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల అక్రమాస్తుల సీజ్ - Acb town planning News

ACB Raids: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.

ACB Raids
ACB Raids

By

Published : Apr 23, 2022, 9:53 AM IST

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. స్థిర, చర ఆస్తులు కలిసి మొత్తం 3.5 కోట్ల రూపాయల మేర ఉన్నట్టు అనిశా తనిఖీల్లో బయటపడింది. శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌, వాసవినగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు బృందాలు సోదాలు జరిపాయి.

ఇళ్లు, ఇంటి స్థలాలకు చెందిన పత్రాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి ఆభరణాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రాములును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details