తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుపై తాచుపాము విన్యాసాలు... ఆసక్తిగా గమనించిన నగరవాసులు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లోని కొత్తపేట-సరూర్​నగర్ రహదారిపై తాచుపాము హల్​చల్ చేసింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపై నుంచి విద్యుత్ తీగల మీదకు పాకుతూ విన్యాసాలు చేసింది. స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

రహదారిపై పాము, రోడ్డుపై పాము కలకలం
snake, snake on road

By

Published : Jun 14, 2021, 9:10 PM IST

హైదరాబాద్​ నగరంలోని కొత్తపేట-సరూర్‌నగర్ రహదారిపై తాచుపాము కలకలం సృష్టించింది. ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్టు కొమ్మలపై నుంచి విద్యుత్ తీగలపై వెళ్తుండగా స్థానికులు, వాహనదారులు గమనించారు. విద్యుత్ తీగలపై వెళ్తున్న పామును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

తాచుపాము కలకలంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఫ్రెండ్స్‌ స్నేక్ ఆఫ్ సొసైటీకి స్థానికులు సమాచారం అందించారు. సొసైటీ సభ్యులు అక్కడకు చేరుకుని పామును సురక్షితంగా బంధించి తీసుకెళ్లారు.

రహదారిపై పాము, రోడ్డుపై పాము కలకలం

ఇదీ చదవండి:మద్యం బాటిళ్లకు పూజ చేసిన మందు బాబు

ABOUT THE AUTHOR

...view details