తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స - latest news on A rare surgery for a seven year old child

ఏడేళ్ల ఓ చిన్నారి.. తన శరీరంలో కుడివైపు భాగంలో తరచుగా వచ్చే నొప్పితో బాధపడుతోంది. అందరితో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన తమ కూతురు తరచుగా నొప్పితో బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు.. ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు విజయవంతంగా ఆమె సమస్య పరిష్కరించారు.

A rare surgery for a seven year old child
ఏడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

By

Published : Jan 19, 2020, 3:51 PM IST

రంగారెడ్డి జిల్లా జ‌గ‌ద్గిరిగుట్టకు చెందిన‌ ఏడేళ్ల ఉమ్మె రుమాన్ ఖ‌తూన్ త‌న శ‌రీరంలోని కుడివైపు భాగంలో త‌ర‌చుగా నొప్పితో బాధపడేది. తల్లిదండ్రులు చిన్నారిని ఎల్బీనగర్​లోని అవేర్​ గ్లోబల్​ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మూత్రనాళంలో సుమారు 9 మి.మీ. రాయి ఉన్నట్లు గుర్తించారు.

రాయిని తొలగించేందుకు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని భావించిన వైద్యులు రెట్రోగ్రేడ్​ ఇంట్రారెనల్​ సర్జరీ (ఆర్ఐఆర్ఎస్‌) అనే అధునాతన విధానాన్ని ఉపయోగించారు.

జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం..

గతంలో చిన్నారుల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య అరుదుగా ఉండేదని.. గ‌త 10 సంవత్స‌రాల కాలంలో ఈ త‌ర‌హా ఆరోగ్య స‌మ‌స్య‌లు తర‌చుగా సంభ‌విస్తున్నాయని అవేర్​ గ్లెనిగల్స్​ గ్లోబల్ హాస్పిటల్​ సీఓఓ డా.మెర్విన్​​ పేర్కొన్నారు. ప్ర‌పంచ జ‌నాభా పెరుగుతున్న‌ట్లే.. వ్యాధుల్లో సైతం పెరుగుద‌ల కనిపిస్తోందన్నారు. జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు ఈ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణమని ఆయన వెల్ల‌డించారు.

ఏడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

ఇవీ చూడండి: డబ్ల్యుూఈఎఫ్​కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details