తెలంగాణ

telangana

ETV Bharat / state

murder: అర్ధరాత్రి ఫోన్ చేశారు.. అతికిరాకంగా తల, చేతులు నరికేసి చంపేశారు! - నరికి చంపిన దుండగులు

అర్ధరాత్రి అత్యవసరమని ఫోన్ చేశారు. ఏం కష్టమొచ్చిందో.. అని హడావుడిగా వెళ్లిన వ్యక్తిని అతి కిరాతంగా హత్య చేశారు. కళ్లలో కారం చల్లి కత్తులతో హింసాత్మకంగా చంపేశారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని అలంఖాన్​గుడలో చోటుచేసుకుంది.

a person murder
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం అలంఖాన్‌గూడాలో దారుణం

By

Published : Sep 11, 2021, 4:06 PM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలం మహాలింగాపురానికి చెందిన వెంకటయ్యకు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. అత్యవసరంగా శుభగృహ వెంచర్ వద్దకు రావాలని ఆ ఫోన్ సందేశం. పని ఉందని, అక్కడికి వస్తే మాట్లాడుకుందామని చెప్పారు. వెంకటయ్య హడావుడిగా బయలుదేరి వెళ్లాడు. అక్కడకు వెళ్లగానే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అసలేం జరిగిందో తెలియదు కానీ... వెంకటయ్యను దుండగులు అతి కిరాతంగా హత్య చేశారు.

కళ్లలో కారం చల్లి...

వెంకటయ్య కళ్లలో కారం చల్లారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేశారు. తల, రెండు చేతులను నరికేశారు. ఆ ప్రాంతమంతా ఎంతో భీకరంగా తయారైంది. రక్తంతో నిండిపోయింది. ఉదయాన్నే మహాలింగాపురం గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. శంకర్​పల్లి సీఐ మహేశ్ ఘటనా స్థలానికి వెళ్లారు. పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్​స్వ్కాడ్ రంగంలోకి దిగింది. క్లూస్​ టీమ్ బృందం సాక్ష్యాలను వెతికే పనిలో పడింది.

నిందితుల కోసం గాలిస్తున్నాం...

వెంకటయ్యను అత్యంత కిరాతకంగా హత్యచేసిన నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. వీలైనంత త్వరలోనే వారిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య హంసమ్మ ఫిర్యాదు చేసింది. సీఐ నేతృత్వంలో పోలీసుు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Daughter Killed Mother: తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం

ABOUT THE AUTHOR

...view details