రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరానికి చెందిన జగదీష్‌కు నాలుగేళ్ల క్రితం పూడూరు మండలానికి చెందిన యువతితో వివాహం జరిపించారు. వారికి ఒక కుమారుడు, కూమార్తె ఉన్నారు. మద్యానికి బానిసై ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు.
గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య చుట్టుపక్కల వారికి విషయం తెలిపింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం - పోలీసులు
మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది.
మద్యానికి బానిసై వ్యక్తి బలవన్మరణం
ఇవీ చూడండి : పైసలిస్తే అందలం ఎక్కిస్తా... కాదంటే కాళ్లు పట్టిస్తా