తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీలో వైరస్​ వ్యాప్తి కట్టడికి మాస్కు పోరాటం - coronavirus updates

జనసాంద్రత ఎక్కువగా ఉండే మురికివాడల్లో కరోనా ప్రబలితే... దాని వ్యాప్తిని అడ్డుకోవటం కష్టమని భావించిన హైదరాబాదీ సంస్కృత.. వారు వైరస్ బారిన పడకుండా అడ్డుకునేందుకు మాస్కుల పంపిణీని సేవా మార్గంగా ఎంచుకున్నారు. కోకాపేట్​లోని తన బొటిక్​నే మాస్కుల తయారీ కేంద్రంగా మార్చి నిరుపేదలకు ఉచితంగా క్లాత్ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. నిరుపేదలకు మాస్కుల పంపిణీ ఆవశ్యకతను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

masks
masks

By

Published : Apr 13, 2020, 2:15 PM IST

బస్తీలో వైరస్​ వ్యాప్తి కట్టడికి మాస్కు పోరాటం

బొటిక్​నే మాస్కుల తయారీ కేంద్రంగా మార్చారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?

అందరికి మాస్కులు అందించాలనే ఉద్దేశంతో మాస్కుల తయారీ ప్రారంభించాం. పేదలకు, అనాథలకు మాస్కులు అందడం కష్టం. వారందరికీ ఉచితంగా ఇవ్వాలని మాస్కుల తయారీ మొదలు పెట్టాము. ఇప్పటివరకు 5వేల మాస్కులు పంపిణీ చేశాం.

మాస్కుల పంపిణీ ఎలా చేస్తున్నారు. ఇందుకోసం ఏమైనా బృందాన్ని ఏర్పాటు చేశారా?

మాకు గండిపేట్​ వెల్ఫేర్​ సొసైటీ అనే ఎన్జీవో ఉంది. దాని ద్వారా పంపిణీ చేస్తున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్లు, పోలీసుల ద్వారా పంపిణీ చేస్తున్నాం.

క్లాత్ మాస్కులు తయారు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?

అందరికి ఎన్​95 మాస్కులు దొరకడం కష్టం. వినియోగం పెరగడం వల్ల ఎవరికి అవసరమో వారికి దొరకడం లేదు. ఇది కాటన్​తో తయారు చేస్తున్నాం. దీన్ని శుభ్రపరచడం సులభం. ఉతికిన 20నిమిషాల్లోనే ఎండిపోతుంది.

రోజుకు ఎన్ని మాస్కులు తయారు చేస్తున్నారు?

రోజుకు 600మాస్కులు తయారు చేస్తున్నాము. వర్కర్లు భౌతిక దూరం పాటిస్తూ పని చేస్తున్నారు. బస్తీల్లో ఎక్కువగా పంచుతున్నాము. ఎందుకంటే అక్కడ వైరస్ వ్యాప్తి అయితే అరికట్టడం కష్టం.

ఇదీ చూడండి:గాంధీభవన్​లో కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

ABOUT THE AUTHOR

...view details