భార్య, కుమారుడితో సహా శ్రీశైలం వెళ్లిన ఓ కుటుంబం కనిపించకుండా పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జరిగింది. స్థానిక శాంతి నగర్ కాలనీకి చెందిన శ్రీధర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా గత నెల 30న భార్య, కుమారుడితో కలిసి శ్రీశైలం వెళ్లాడు. మూడు రోజుల వరకు అక్కడే ఉన్న శ్రీధర్ రెడ్డి తల్లితో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత ఫోన్ కలవకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి ఈ నెల 5న రాత్రి తల్లితో ఫోన్లో మాట్లాడాడు. ఛార్జింగ్లేదని... శ్రీశైలంలోనే ఉన్నట్లు చెప్పాడు. తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడం వల్ల ఈనెల 16న హయత్నగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఆ కుటుంబం ఏమైనట్లు?
పుట్టిన రోజు సందర్భంగా భార్య, కుమారుడితో సహా శ్రీశైలం వెళ్లిన కుటుంబం కనిపించకుండా పోయిన ఘటన హయత్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పుట్టిన రోజుకని వెళ్లి... కుటుంబంతో సహా అదృశ్యం
అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్ రెడ్డి ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి కాగా... అతడి భార్య ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుంది. వీరికి 15నెలల బాబు ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి వాస్తవంగా శ్రీశైలంలోనే ఉన్నాడా?, మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: పోలీస్ ఉద్యోగం వచ్చింది..మృత్యువు వెంటాడింది..