రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి సమయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రాజేష్ కుటుంబం నిద్రిస్తుండగా ఇంట్లోకి చోరబడిన దుండగులు వారిపై మత్తుమందు చల్లి దొంగతనానికి తెగబడ్డారు. బీరువా తలుపులు పగులగొట్టి 3 తులాల బంగారం, నగదు, చరవాణి ఎత్తుకెళ్తుండగా... రాజేష్‌కి మెలకువొచ్చి కేకలు వేశాడు. ఎక్కడ దొరికిపోతానన్న భయంతో దొంగలు తమతో తెచ్చుకున్న ఆటోను వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
అత్తాపూర్‌లో అర్ధరాత్రి తెగబడ్డ దొంగలు - BYKES
అత్తాపూర్‌లో దొంగలు అర్ధరాత్రి తెగబడ్డారు. ఇంట్లో అందరు ఉండగానే చోరబడి... మత్తు మందు చల్లి... దొంగతనం చేశారు. మెలుకువ వచ్చి అరిచిన ఇంటి యజమానులకు దొరక్కుండా వెళ్లే క్రమంలో తమతో తెచ్చుకున్న ఆటోను కూడా వదిలేసి పరారయ్యారు.
man-in-attapur