రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మందకొడిగా సాగినా.. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పెరిగారు. సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. చేవెళ్లలో 74.38 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,674 గాను 1,989 పోలయ్యాయి.
చేవెళ్లలో 74.38 శాతం పోలింగ్ నమోదు - Chevella mlc elections updates
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఓటర్లు 2,674 గాను 1,989 పోలయ్యాయి. 74.38 శాతం పోలింగ్ నమోదైంది.
చేవెళ్లలో 74.38 శాతం పోలింగ్ నమోదు
చేవెళ్ల, షాబాద్ మండలాలలో ఉపాధ్యాయులు చివరి సమయంలో వచ్చి తమ ఓటును ఉపయోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కూడా ఓటర్లు క్యూలో ఉన్నారు. పోలింగ్ బూత్‌లో యువకులే ఏజెంట్లుగా కూర్చోవడం గమనార్హం.
ఇదీ చూడండి:ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్.. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం