రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లిలో చిన్నారిని అపహరించిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఐదు గంటల తర్వాత బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు.
చటాన్‌పల్లిలో కిడ్నాప్ అయిన చిన్నారి లభ్యం - chatanpally kidnap
షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లిలో నాలుగేళ్ల బాలిక అపహరణ కథ సుఖాంతం అయింది. ఐదు గంటల అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు బాలికను తీసుకువచ్చి లొంగిపోయాడు.
చటాన్‌పల్లిలో నాలుగేళ్ల బాలిక అపహరణ... అనంతరం లభ్యం
గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్న శివ కుమార్తె స్నేహిత.. షాద్‌నగర్ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతోంది. మంగళవారం పాఠశాల నుంచి వచ్చి ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి చాక్లెట్ ఆశ చూపి బాలికను వాహనంపై తీసుకెళ్లాడు. ఐదు గంటల అనంతరం నిందితుడు బాలికను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చాడు.
ఇవీ చూడండి: యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్ సమీక్ష