తెలంగాణ

telangana

ETV Bharat / state

గురుకులాలపై కరోనా పడగ..100మందికి పైగా కొవిడ్ - corona for 41 students in rangareddy

41-members-tested-positive-in-hayathnagar-gurukul-school
హయత్‌నగర్‌ గురుకులంలో 41, బోయిన్‌పల్లిలో 40 మందికి కరోనా

By

Published : Mar 20, 2021, 5:48 PM IST

Updated : Mar 20, 2021, 7:04 PM IST

17:47 March 20

గురుకులాలను వెంటాడుతున్న కరోనా మహమ్మారి

రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు కొవిడ్​ బారిన పడుతున్నారు. కరోనా వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.  

హయత్‌నగర్‌ గురుకులంలో 41, బోయిన్‌పల్లిలో 40 

తాజాగా హయత్‌నగర్‌ గురుకుల పాఠశాలలో 41 మందికి వైరస్​ నిర్ధారణ అయింది. 37 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులకు పాజిటివ్​గా తేలింది. మిగతా విద్యార్థులకూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బోయిన్‌పల్లి ప్రభుత్వ వసతిగృహంలోనూ వార్డెన్​ సహా 40 మంది కొవిడ్ బారినపడ్డారు.

ఖమ్మం జిల్లా పెద్దమండవలో..

తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ పాఠశాలలోని 10 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

నాగర్​కర్నూల్​లో

నాగర్ కర్నూలులోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులకు మహమ్మారి సోకింది. ఇదే గురుకుల పాఠశాలలో నిన్న నలుగురికి వైరస్ వచ్చింది. మొత్తం ఇప్పటివరకు 16 మంది విద్యార్థులకు కరోనా బారిన పడ్డారు. అధికారులు స్పందించి శానిటేషన్ చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు. 16 మంది విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్​లో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

నిర్మల్​ జిల్లాలో.. 

నిర్మల్ జిల్లా ముథోల్​లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.  భైంసాలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో వైరస్‌ బాధితుల సంఖ్య 40కి చేరింది. గురుకుల కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిపి 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్ అని తేలింది. కరోనా వ్యాప్తితో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో.. 

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులోని  కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందులో ఓ  అధ్యాపకురాలికి కరోనా పాజిటివ్​ గా నిర్ధారణైంది. ఆమెతో చనువుగా ఉన్న వారిని పాఠశాల పైఅంతస్తులో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఇదీ చూడండి: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో కరోనా కలకలం

Last Updated : Mar 20, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details