రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
19:47 May 31
రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్, నరేశ్, రవిందర్గా గుర్తించారు.
అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వీరు నలుగురు 2004-2005లో 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు. అప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉండేవారు. వారిలో రాఘవేందర్ వికారాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో ఆలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఇదీ చూడండి :సోమవారం నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 30 ప్రత్యేక రైళ్లు