తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరుత దాడిలో మరో 3 లేగ దూడలు మృతి - రంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత దాడి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్​ మండలం చుట్టు పక్కల గ్రామాల్లో చిరుత దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం తెల్లవారు జామున చిరుత దాడి చేసి మరో 3 లేగ దూడలను హతమార్చింది. మూడు నెలలుగా చిరుతను పట్టుకోవడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిరుత దాడి

By

Published : May 30, 2019, 10:51 AM IST

చిరుత దాడిలో 3 లేగ దూడలు మృతి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి శివారులో మరోసారి చిరుత పులి దాడి కలకలం రేపింది. గురువారం తెల్లవారు జూమున రైతులైన సక్రియ, పాండు, బిక్కు నాయక్​లకు చెందిన మూడు లేగదూడలను చంపేసింది. మూడు నెలలుగా చిరుత దాడులు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు దానిని బంధించడంలో విఫలమవుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అటవీ అధికారుల అసమర్థత కారణంగానే తమ దూడలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details