ఇవాళ పురపాలక ఎన్నికలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు గడవు ముగిసే సమయానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38, ఆదిబట్లలో 29, నామినేషన్లు వచ్చాయి. అలాగే నర్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఆరు గ్రామాల నుంచి సుమారు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
పురపాలికల్లో రెెండోరోజూ నామినేషన్ల జోరు - 2nd day MUNICIPAL ELECTIONS NOMINATIONS IN RANGAREDDY, MEDCHAL DISTRICT
రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. రేపు చివరి రోజు కావటం వల్ల రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు.
పుర ఎన్నికల్లో... రెబల్స్ జోరు