రేషన్ బియ్యాన్ని అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న నిందితున్ని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బాబా నగర్ ప్రాంతంలో నివసించే మక్ధుమ్... 6 నెలలుగా రేషన్ బియ్యాన్ని లబ్దిదారుల నుంచి తక్కువ ధరలకు కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడు.
అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం - rangareddy news
రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో అక్రమంగా నిల్వ ఉంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఓ లారీ, ద్విచక్రవాహనం, లక్ష నగదు, చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
25-tons-of-pds-rice-caught-in-balapur
25 టన్నుల బియ్యాన్ని వేరే రాష్ట్రానికి తరలించేందుకు ప్రయత్నించగా... సమాచారం అందుకున్న పోలీసులు నిల్వ చేసిన ఇంటిపై దాడి చేశారు. నిందితుని వద్ద నుంచి 25 టన్నుల బియ్యం, లక్ష నగదు, ఒక లారీ, ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.