శంషాబాద్ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారం పట్టివేత - శంషాబాద్లో బంగారం పట్టివేత
17:06 February 14
శంషాబాద్ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో మరొసారి కిలోకు పైగా అక్రమ బంగారం పట్టుబడింది. జడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు.
ఇవాళ ఉదయం 7 గంటలకు జడ్డా నుంచి శంషాబాద్ వచ్చిన ఒక వ్యక్తితోపాటు మరో ముగ్గురు మహిళలను తనిఖీ చేయగా వారి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినట్లు వివరించారు. ఒక్కొక్కరి వద్ద నుంచి మూడు వందల గ్రాముల చొప్పున రూ.48లక్షలు విలువైన 12వందల గ్రాములు పట్టుబడినట్లు తెలిపారు.