నాలుగు నెలల బాలుడి వైద్యానికి ఓ కుటుంబం రానుపోను దాదాపు 100 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం చింతపట్లకు చెందిన దంపతులు శ్రీశైలం, మానస.. తమ కుమారుడు మల్లికార్జున్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆందోళన చెందారు. కాలినడకన నల్గొండ జిల్లాలోని ఓ వైద్యకేంద్రంలో చూపించారు.
పసివాడి వైద్యం కోసం 100 కి.మీ. నడక - Parent's call for son's health in Rangareddy district
అనారోగ్యంతో బాధపడుతున్న కన్నపేగును బతికించుకునేందుకు.. ఆతల్లిదండ్రులు ఏకంగా 100కిలో మీటర్లు నడిచారు. లాక్ డౌన్ కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.
![పసివాడి వైద్యం కోసం 100 కి.మీ. నడక 100 km to the boy's medicine. Couples who walk In Rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7177577-430-7177577-1589353592592.jpg)
అమ్మ ఆవేదన: వైద్యం కోసం.. 100 కి.మీ. నడక..
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా బాలుడికి వాంతులు, నోటి నురగలు తగ్గక పోవడం వల్ల యాచారం నుంచి నగరానికి (సుమారు 50 కి.మీ) నడిచి వచ్చి సోమవారం ఆర్కేపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. వారి వెంట కూతురు కూడా ఉంది. మంగళవారం మళ్లీ కాలినడకనే ఇంటికి బయల్దేరారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ఇదీ చూడండి:తెలంగాణలో ప్రజా రవాణాకు కసరత్తు..