రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన తుమ్మనవేణి సురేశ్ (19) అనే యువకుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గ్రామ శివారులోని జక్కుల చెరువులో ఈతకు వెళ్లి శనివారం మధ్యాహ్నం గల్లంతయ్యాడు.
జక్కుల చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి - జక్కుల చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన తుమ్మనవేణి సురేశ్.. జక్కుల చెరువులో ఈతకు వెళ్లి మృతి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా.. సురేశ్ మృతదేహాం లభ్యమైంది.
![జక్కుల చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి young man killed swimming in pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6941888-thumbnail-3x2-eet.jpg)
జక్కుల చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఎమ్మార్వో శ్రీకాంత్, డిప్యూటీ ఎమ్మార్వో జయంత్, స్థానిక సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది.. గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత సురేశ్ మృతదేహం చెరువులో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:ఖరీఫ్, రబీ పేర్లు రద్దు..వానాకాలం, యాసంగి ముద్దు