రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మీ సేవ కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. సిరిసిల్ల పట్టణంలోని మీ సేవ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న దుర్గేశ్వరి అనే మహిళను కరీంనగర్ డిపో1కి చెందిన బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. మహిళ తలపై నుంచి బస్సు దూసుకెళ్లడం వల్ల మృతురాలి తల నుజ్జునుజ్జయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు సిరిసిల్ల ఎస్సై రాజేశ్వర రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీ.. వివాహిత అక్కడికక్కడే మృతి - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు
ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీ.. వివాహిత మృతి